కలం, వెబ్ డెస్క్: మరికొద్ది రోజుల్లో 2025 ముగియనుంది. ఈ ఏడాది స్టార్ హీరోయిన్స్ సినిమాలు లెక్కకుమించి రిలీజ్ అయ్యాయి. కానీ ఏ హీరోయిన్ ఆధిపత్యం ప్రదర్శించింది అనేది ఆసక్తికరం అంశం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ముద్దుగుమ్మల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశారు. కానీ నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) మాత్రం ఇతర హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి నెంబర్ 1 ట్యాగ్ సొంతం చేసుకుంది. లోకల్ టు గ్లోబల్ అంటూ దేశవ్యాప్తంగా అభిమానులను అలరించింది. నేషనల్ క్రష్ నుంచి నేషనల్ పవర్ హౌస్‌గా మారి భారీ సక్సెస్ రేటు అందుకుంది.
ఈ ఏడాది రష్మిక మంచి విజయాలు అందుకుంది. ఫలితంగా దేశంలోనే అత్యంత విజయమైంత హీరోయిన్‌గా నిలిచింది. చావా సినిమాలో చారిత్రాత్మక నటన ఆమెకు భారీ విజయం తెచ్చిపెట్టింది. మహారాణిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాదాపు రూ.808 కోట్ల ప్రపంచ వసూళ్లను తెచ్చిపెట్టింది. అలాగే ది గర్ల్‌ఫ్రెండ్, కుబేరా వంటి ప్రయోగాత్మక చిత్రాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. థమ్మా, పుష్ప 2: ది రూల్ సినిమాలు రష్మికకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ఐదు విభిన్న భాషల్లో 40 నుంచి 60శాతం సక్సెస్ రేటును నమోదు చేసింది. బాలీవుడ్ (Bollywood) హీరోయిన్స్ అలియా భట్, కృతి సనన్‌ను సైతం దాటేసింది. వరుస విజయాలతో నెంబర్ వన్ హీరోయిన్‌గా 2025 ముగించింది.


