ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. ఆర్టీసీ డ్రైవ‌ర్ జాబ్ గల్లంతు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఫోన్ చూస్తూ నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఓ ఆర్డీసీ డ్రైవ‌ర్‌ (RTC Driver) కు ఉన్న‌తాధికారులు షాకిచ్చారు. ఏకంగా ఉద్యోగంలో నుంచి తొల‌గించేశారు. చిత్తూరు (Chittoor) జిల్లాలోని ప‌ల‌మ‌నేరులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌ణేష్ కుమార్ ఆర్టీసీలో హైర్ డ్రైవ‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల‌ ప‌ల‌మ‌నేరు-మ‌ద‌న‌ప‌ల్లె మార్గంలో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. గ‌ణేష్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తుండ‌గా ఓ ప్ర‌యాణికుడు వీడియో తీశాడు. ప్ర‌యాణికుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతూ ఇలా నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేయ‌డం ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉన్న‌తాధికారుల‌కు పంపించాడు.

ఈ వీడియో మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి దృష్టికి వ‌చ్చింది. దీంతో స‌ద‌రు డ్రైవ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టిన ప‌ల‌మ‌నేరు డిపో మేనేజ‌ర్ డ్రైవ‌ర్‌ను విధుల నుంచి తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆర్టీసీ డ్రైవ‌ర్లు విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించ‌వ‌ద్ద‌ని, ప్ర‌యాణికుల ర‌క్ష‌ణ‌ను దృష్టిలో పెట్టుకొని బాధ్య‌త‌తో ఉండాల‌ని అధికారులు సూచించారు.

Also Read : ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>