ప్రజలను అప్రమత్తం చేయాలి.. మంత్రి లక్ష్మణ్ ఆదేశాలు

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి తుమ్మేనాల – నర్సయ్యపల్లె గ్రామాల మధ్య ఉన్న రహదారి కొట్టుకుపోవడంతో అధికారులతో కలిసి దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. రహదారి దెబ్బతిన్న కారణంగా గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆయన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే తాత్కాలిక రాకపోకల ఏర్పాట్లు చేయాలని మంత్రి (Adluri Laxman) ఆదేశించారు. అనంతరం శాశ్వత మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులపై నిరంతరం నిఘా ఉంచాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు.

Also Read : ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>