కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గట్టు మండలం బోయలగూడెం శివారులో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. వీరి నుంచి రూ.44,110 నగదు, 6 ఫోన్లు, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

