జిత్వానీ కేసులో కీల‌క ప‌రిణామం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో హాట్ టాపిక్‌గా ఉన్న ముంబై న‌టి కాదాంబ‌రి జిత్వానీ కేసు (Kadambari Jethwani Case)లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితుల‌ను కేసు నుంచి తొల‌గిస్తున్ట‌న్లు సీఐడీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. బ్లాక్‌మెయిల్ చేసి డ‌బ్బులు వ‌సూలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కుక్క‌ల విద్యాసాగ‌ర్ రావు జిత్వానీ స‌హా ఆమె త‌ల్లిదండ్రులు, సోద‌రుడిపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు నుంచి జిత్వానీ త‌ల్లిదండ్రుల‌ను, సోద‌రుడిని తొలగిస్తూ సీఐడీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై కుక్క‌ల విద్యాసాగ‌ర్ రావు త‌ర‌ఫు న్యాయ‌వాది తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కోర్టు ఈ కేసు త‌దుప‌రి విచార‌ణను ఆగ‌స్ట్ 12కు వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>