గుడ్ న్యూస్.. మరింత సులభంగా ఫ్యామిలీ సర్టిఫికేట్

కలం, వెబ్ డెస్క్: ఫ్యామిలీ సర్టిఫికేట్ (Family Certificate) జారీ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మీ సేవ కేంద్రం, తహసీల్దార్ కార్యాలయంలో సులభంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకోవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పలువురికి సర్టిఫికేట్లు అందించి మాట్లాడారు.

ప్రతి కుటుంబం వివరాలు నమోదు..

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ, సన్న బియ్యం, ఉచిత కరెంట్ వంటి పథకాలు పొందే క్రమంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ అవసరమవుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇక నుంచి సులభంగా పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేట్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>