కలం, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం సందర్భంగా గిరిజన బాలికలు ప్రదర్శించిన గిరిజన నృత్యం థింసా (Tribal Dhimsa Dance) గిన్నిస్ రికార్డు సాధించింది. సుమారు 13 వేల మంది గిరిజన విద్యార్థినులు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించి అరుదైన ఘనత సాధించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని విద్యార్థినులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం గిన్నిస్ ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రేపు అల్లూరి విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ థింసా నృత్యంతో విద్యార్థినులు ఘన స్వాగతం పలకనున్నారు.
మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. యువత సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం వల్ల స్థానికంగా పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధి చెందడంతో పాటు వికసిత్ భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు.
Also Read : చనిపోయిన మహిళ బతికింది.. అంతా షాక్!
Follow Us On : WhatsApp

