నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలో వెండితెరపై మెరవనున్న తేజస్విని

కలం, వెబ్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని (Nandamuri Tejaswini) త్వరలో వెండితెరపై మెరవనున్నారు. ఓ స్పోర్ట్స్ డ్రామా కథతో తేజస్విని వెండితెర అరంగేట్రం చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా, ఓ సందేశాత్మక చిత్రంగా మలిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

కాగా ఇటీవల తేజస్విని నెట్టింట షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వీడియోలో తేజస్విని చూపిన అద్భుతమైన ఎనర్జీ, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తేజస్విని సినిమాల్లోకి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు తేజస్విని (Nandamuri Tejaswini) వెండితెరపై కనిపించనుందనే వార్తతో నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Read Also: డేటింగ్ యాప్స్‌తో డేంజర్.. యువతకు గైనకాలజిస్ట్ హెచ్చరిక!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>