కలం, వెబ్‌డెస్క్: యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. నేడు సీఎం రేవంత్ శక్తి డిపార్ట్‌మెంట్ (Shakti Department) పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్, విదేశీ భాషల శిక్షణ వింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఏటీసీల్లో డ్రోన్ టెక్నాలజీ, ఈవీ సర్వీస్ కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు.
ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించాలని సీఎం (Revanth Reddy) ఆదేశించారు. టామ్‌కామ్‌ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. పాస్‌పోర్ట్ మొదలు విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే వరకు టామ్‌కామ్ బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో డిమాండ్‌కు తగినట్లు నర్సింగ్ కలాశాలలకు అనుమతులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read : సీఎం విడాకులకు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్!
Follow Us On: Sharechat

