కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఏపీ, తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల (Telugu States Projects) నీటిమట్టాల వివరాలను ఆయా ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. జూరాల పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 8.13 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు 16,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,05,198 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.5 TMC లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1069.20 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత ప్రాజెక్ట్ సామర్థ్యం 22 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర పూర్తి సామర్థ్యం 105.79 టీఎంసీలకు గానూ 37.10 టీఎంసీల నీరు చేరింది. సుంకేశుల పూర్తి సామర్థ్యం1.24 టీఎంసీలు కాగా.,. ప్రస్తుత నిల్వ 0.55 టీఎంసీలుగా ఉంది.
ఇ శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 51.18 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 76,271 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.క నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 136.99 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 29.04 టీఎంసీలుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 3.07 టీఎంసీలకు గాను 2.98 టీఎంసీల నీరుంది. ధవళేశ్వరం ప్రాజెక్టుకు సైతం భారీ వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుకు 2,36,870 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. ఏలేరు ప్రస్తుత నిల్వ 8.35 టీఎంసీలు కాగా, సోమశిలలో 28.70 టీఎంసీల నీరు నమోదైంది.

