అన్నాసాగర్‌లో ఘనంగా ‘వన మహోత్సవం’.. కల్పవృక్షం నాటిన సర్పంచ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా, భూత్పూర్ మండలం అన్నాసాగర్ (Annasagar) గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మోత్సవం (Vanamahotsavam) కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో శుక్రవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డితో పాటు గ్రామ వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి అరుదైన కల్పవృక్షం, సీతాఅశోక మొక్కలను నాటారు. ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. మనిషి చేస్తున్న తప్పుల వల్లే పర్యావరణం దెబ్బతింటుందని వర్షాలు సకాలంలో కురవడంలేదని ఆయన అన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ అన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఉపసర్పంచ్ భాగ్యశ్రీ రమేష్, మాజీ ఎంపీటీసీ ఈట రజిత శేఖర్, గ్రామ వార్డు సభ్యులు కారూర్ శీను, కల్పన, అల్లిపురం నాగేందర్, శైలజ, చట్కరి నవీన్, యాదమ్మ, నాగమణి, పాఠశాల ఉపాధ్యాయులు, చక్రవర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>