సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్

కలం, నిర్మల్: ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ (Nirmal) డీఎస్పీ శ్రీనివాస్ (DSP Srinivas) అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ (Cordon Search) నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు గోపి, శ్రావణి, హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>