రోడ్డుపై బోల్తా పడిన ఆపిల్స్ డీసీఎం.. పండ్ల కోసం ఎగబడ్డ జనం..!

కలం, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డుపై పడిపోయిన ఆపిల్ పండ్లను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు ఎగబడటంతో క్షణాల వ్యవధిలోనే పండ్లన్నీ లూటీ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా తొర్రూర్ మండలం మాటేడు గ్రామ స్టేజ్ వద్ద ఆపిల్ పండ్ల లోడుతో వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పింది.

దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల క్యాట్లు అన్నీ రోడ్డుపైకి చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా రోడ్డుపైకి భారీగా చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేయడం కంటే, రోడ్డు అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న ఆపిల్ పండ్లను ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. చేతికి దొరికినన్ని పండ్లను ఎత్తుకెళ్లేందుకు జనం పోటీ పడడంతో నిమిషాల వ్యవధిలోనే ఆపిల్ పండ్ల లోడు మొత్తం లూటీ అయిపోయింది. రోడ్డుపై జరిగిన ఈ తతంగాన్ని చూసి ప్రయాణికులు విస్మయానికి గురయ్యారు.

Read Also: ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌పై క్రేజీ అప్‌డేట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>