ఫీజుల బకాయిలపై బీజేపీ పోరు.. విద్యార్థులతో సంతకాల సేకరణ

కలం, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, యువ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి (Wanaparthy ) జిల్లా కేంద్రంలో “ఫీజుల బకాయి–బీజేపీ లడాయి” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేవైఎం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతూరి బుడ్డన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అరవింద్, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోపీనాథ్, చిన్న రాయుడు, చందు, నవీన్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>