హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందజేసిన సీపీ

కలం, హనుమకొండ: విధి నిర్వహణలో ఉండగా ఆకస్మికంగా మరణించిన హోంగార్డు కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (Warangal CP Swetha) రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో అందజేశారు. రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయక సిబ్బందిగా సేవలందిస్తున్న హోంగార్డులు ఆకస్మికంగా లేదా ప్రమాదాల్లో మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది.

ఈ పథకం కింద దుగ్గొండి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ గత ఏడాది ఆకస్మికంగా మరణించిన పి. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. మృతుడు పి. శ్రీనివాస్ రెడ్డి భార్యకు సీపీ ఎన్. శ్వేత (Warangal CP Swetha) స్వయంగా చెక్కును అందించి, కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ శ్రీనివాస్, హోంగార్డ్స్ ఆర్‌ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>