కలం, వెబ్ డెస్క్: అంతర్రాష్ట్ర నదీ జలాల అంశంపై రాజధాని ఢిల్లీలో తెలంగాణ–కర్ణాటక నేతలు కీలక సమావేశం (Telangana – Karnataka) నిర్వహించారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్ లో కర్ణాటక సీఎం డీకే శివ కుమార్ తో తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సమావేశమయ్యారు. ఈ మేరకు రాష్ట్రాలకు నీటి పంపకాలపై చర్చించారు. ముఖ్యంగా తుంగభద్ర, కృష్ణ నదీ జలాలపై కీలకంగా చర్చించారు. ఈ మేరకు జల వివాదాల పరిష్కారంపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్రాష్ట్ర జలాల అంశాల్లో సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.
Read Also: తెలంగాణ సాగునీటి రంగానికి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Follow Us On : WhatsApp

