గిరాకీ ఆశ.. వరద నిరాశ.. మక్క కంకుల వ్యాపారి ఆవేదన!

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) కంటేశ్వర్ చౌరస్తాలో మక్క కంకులు అమ్ముకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి తాను తెచ్చిన మొక్కజొన్న పొత్తులు రోడ్డుపై పెట్టాడు. వాతావరణం చల్లగా ఉంది బాగా గిరాకీ అవుతుందని భావించాడు. అకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభం అయింది. వర్షానికి అతను పక్కనే ఉన్న పాన్ షాప్ వద్ద నిలబడ్డాడు.

అయితే నిముషాల్లోనే వరద పెరిగింది. చూస్తుండగానే  మక్క కంకులు వరదలో సగం వరకు మునిగిపోయాయి. ఆ మక్క కంకులు వరద నీటిలో తడిసిపోయాయి. వర్షం గంట అయినా అలాగే పడుతుండటంతో తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో జనాలు రోడ్లపై కనిపించడం లేదు. దీంతో ‘గిరాకీ దేవుడెరుగు… ఇంటికైనా వెళ్దాం’ అనుకుని, సదరు వ్యక్తి వరదలోని మక్క కంకులను తీసుకొని ఇంటి ముఖం పట్టాడు.

Read Also: తెలంగాణ సాగునీటి రంగానికి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>