కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ‘స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (సెట్) (TG SET) పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియకు ఆగస్టు 3 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది. పూర్తిగా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 30 వరకు అప్లై చేసుకోవచ్చని, ఎడిట్ ఆప్షన్ కోసం సెప్టెంబరు 13-15 మధ్య అవకాశం ఉంటుందని ‘టీజీ సెట్’ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 3-30 మధ్య దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయినవారు ఆ తర్వాత సెప్టెంబరు 5 వరకు రసూ. 1,500 ‘లేట్ ఫీ’తో అప్లై చేసుకోవచ్చని, రెండు వేల ‘లేట్ ఫీ’తో సెప్టెంబరు 10 వరకు, రూ. 3,000 ‘లేట్ ఫీ’తో సెప్టెంబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ‘ఎడిట్ ఆప్షన్’ కోసం అభ్యర్థులు వారి దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు సెప్టెంబరు 13-15 మధ్య అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వారం రోజులకు సెప్టెంబరు 22 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు సెప్టెంబరు చివరివారంలో ఉంటాయని, కచ్చితమైన తేదీని తొందర్లోనే ప్రకటిస్తామన్నారు.
Read Also: తెలంగాణ నయాగరా ఉగ్రరూపం.. బొగతకు భారీ వరద
Follow Us On : WhatsApp

