బాసరలో వైభవంగా ‘వ్యాస పూర్ణిమ’ వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు

కలం, నిర్మల్: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం (Gnana Saraswati Temple) లో బుధవారం ‘వ్యాస పూర్ణిమ’ (Vyasa Purnima) వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Powar Ramarao Patel), మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి (Venugopal Chary) ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బాలాలయంలో పూజలు చేసి వేద పండితులు నిర్వహించిన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించి సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా బాసర క్షేత్రానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Read Also: స్వర్ణ ప్రాజెక్టు గేటు మొరాయింపు.. తాళ్లతో కట్టిన అధికారులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>