కలం, వెబ్‌డెస్క్: నేడు ఉదయం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. విపక్ష నేతల ఆందోళన నడుమ లోక్‌సభ (Lok Sabha) ఓసారి వాయిదా పడి తిరిగి 12 గంటలకు పునః ప్రారంభమైంది. ఈ సందర్భంగా లోక్‌సభలో కేంద్రం మరో కీలక బిల్లును ప్రవేశ పెట్టింది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ జనన మరణాల నమోదు సవరణ బిల్లు (Births and Deaths Amendment Bill) ను సభ ముందుకు తీసుకొచ్చారు. జనన, మరణాల నమోదులో ఆలస్యాన్ని నిరోధించేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
ఈ బిల్లు (Births Deaths Bill) ప్రకారం పుట్టిన లేదా చనిపోయిన సంవత్సరం తర్వాత నమోదు చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల అనుమతితో చేయాల్సి ఉంటుంది. అలాగే నిర్ణీత రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లకు పైగా ఆలస్యమైతే కేవలం అధికారుల అనుమతి సరిపోదు. తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఆలస్యంగా నమోదులు చేయడం, నకిలీ రికార్డులను అరికట్టడం, పౌరుల అధికారిక గుర్తింపును మరింత బలోపేతం చేయడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఈ సవరణలతో పుట్టిన, మరణాల నమోదును సకాలంలో పూర్తి చేయించడం, నకిలీ నమోదులను అరికట్టడం కోసం చర్యలు చేపడుతోంది.
Read Also: గుండు చేసుకుంటే డబ్బు.. తమిళనాడులో ఘరానా మోసం!
Follow Us On: Instagram

