మనుషులకు సైతం మానవత్వం నేర్పే దృశ్యం.. కోతి ఒడిలో పిల్లి

కలం, జనగామ: గురు పౌర్ణమి వేళ బుధవారం జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో కురిసిన మోస్తరు వర్షం వేళ కురుమవాడలో హృదయాలను హత్తుకునే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ కోతి చిన్న పిల్లిని తన ఒడిలో చేర్చుకుని (Monkey Hugs Kitten) ఆప్యాయంగా కూర్చున్న దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే తమ సెల్‌ఫోన్లలో బంధించగా, చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. “ప్రేమకు జాతి లేదు.. మమకారానికి హద్దులు లేవు” అనే మాటలను ఈ దృశ్యం సాక్షాత్కరించిందంటూ పలువురు వ్యాఖ్యానించారు.

మూగజీవాల్లోనూ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎంత గొప్పగా ఉంటాయో తెలియజేసిన ఈ అరుదైన ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. చూసిన ప్రతి ఒక్కరూ “మనుషులకు సైతం మానవత్వం నేర్పించే దృశ్యం ఇదే” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>