ఖమ్మం ఆస్పత్రిలో వైద్యుడి వేధింపులు.. కలెక్టర్ కీలక ఆదేశం!

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (Khammam Govt Hospital)లో ఓ వైద్యుడి వైఖరి తీవ్ర వివాదాస్పదమైంది. విధుల్లో ఉన్న మహిళా డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందిపై సదరు వైద్యుడు వేధింపులకు పాల్పడుతున్నాడంటూ బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

​బాధితుల నుంచి ఫిర్యాదు అందుకోగానే జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు గాను అధికారులు త్రిసభ్య విచారణ కమిటీని నియమించారు. బాధిత మహిళా వైద్యులు, సిబ్బందిపై విచారణ జరిపి పూర్తి స్థాయి ఎంక్వైరీ నివేదికను వారం రోజుల్లోగా తమకు అందజేయాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.

​వైద్య సేవలు అందించే పవిత్రమైన ఆసుపత్రి ప్రాంగణంలో, తోటి మహిళా వైద్యులు, సిబ్బందిపై విధుల్లో ఉన్న వైద్యుడే వేధింపులకు పాల్పడ్డాడనే వార్త ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>