యాదగిరిగుట్టలో బీజేవైఎం నిరసన ర్యాలీ

కలం, యాదగిరిగుట్ట: బీజేపీ యువ మోర్చా (BJYM) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ (Rally) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దయ్యాల కుమారస్వామి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు విడుదల చేయకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అప్పులు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, వృత్తి విద్య అభ్యసించే విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించిన కుమారస్వామి.. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి, యువజన ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో (BJYM Rally) జిల్లా కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, సత్యనారాయణ, మహేష్, చంద్రమౌళి, శ్యాంసుందర్, అశోక్, నరేష్, సురేష్, ప్రసాద్, ప్రభాకర్, కర్ణ, రంగసత్యం, భానుచందర్, దేవేందర్, వినోద్, శివ, సాయి, వంశీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>