పార్టీని ధిక్కరించను.. బోండా ఉమ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని.. భవిష్యత్తులో కూడా ధిక్కరించబోనని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ (Bonda Uma) తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలను పూర్తిగా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు అధిష్ఠానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు ఆయన హాజరై వివరణ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు.

ఆయనే వచ్చి పలకరించారు..

ముద్రగడ (Mudragada) సంస్మరణ సభకి వెళ్లినప్పుడు అనుకోకుండా వైసీపీ నేతలను కలవాల్సి వచ్చిందని బోండా ఉమ తెలిపారు. అంబటి రాంబాబు (Ambati Rambabu) తన వద్దకు వచ్చి పలకరించారని.. ఇదే వాస్తవమన్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసి, విపరీతంగా ట్రోల్స్ చేశారని మండిపడ్డారు. ముద్రగడ కాపు ఉద్యమం వలనే టీడీపీ ఓడిపోయిందనే వ్యాఖ్యలకు తాను (Bonda Uma) కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

Read Also: ఏపీ వైద్య రంగంలో చారిత్రాత్మక ఒప్పందం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>