భైంసా MEOపై విచారణకు డిమాండ్.. విద్యాశాఖ కమిషనర్‌కు వినతి

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా మండల విద్యాధికారి (Bhainsa MEO) నిర్లక్ష్య వైఖరిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చాత్ర యువ సంఘర్షణ సమితి, యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు.

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ షితల్కర్, జిల్లా కార్యదర్శి నవీన్ నమత్కర్ మాట్లాడుతూ.. బైంసా పట్టణంలోని వేదం ఒలింపియాడ్ విద్యాసంస్థపై జూలై 21వ తేదీన ఎంఈఓకు, జూలై 22వ తేదీన డీఈఓకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపించారు. విద్యాసంస్థపై ప్రత్యేక తనిఖీ బృందంతో సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుని విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.

Read Also: సూర్యాపేటలో సీఎంఆర్ దందా.. పరారీలో టీఆర్పీ నేత!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>