కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కుడి చేతి మణికట్టు సమస్యకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో విజయవంతంగా సర్జరీ (Wrist Surgery) జరిగింది. గంగా హాస్పిటల్ చీఫ్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ సర్జరీ నిర్వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి క్లిష్టమైన వెన్నెముక సర్జరీని కూడా డాక్టర్ రాజశేఖరన్ విజయవంతంగా నిర్వహించారు.
రామ్ చరణ్ ఆపరేషన్ కోసం అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడైన ఆయన ప్రత్యేకంగా రామ్ చరణ్ సర్జరీ కోసం రావడం విశేషంగా నిలిచింది. డాక్టర్ ఎస్. రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజతో పాటు నిపుణుల బృందం కలిసి ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని సమాచారం. మరో నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

