కలం, నిర్మల్ : సమాజ ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని, వారి సేవలు వెలకట్టలేనివని లయన్స్ క్లబ్ (Lions Club) నిర్మల్ అధ్యక్షుడు లయన్ వెంకట్ రమణ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ లో గల లయన్స్ క్లబ్ లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు రాజు, గంగయ్య, గంగాధర్, భాస్కర్, నవీన్‌లను శాలువాలతో సత్కరించి దుప్పట్లు పంపిణీ చేశారు.
పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి నిజమైన ఆరోగ్య రక్షకులని కొనియాడారు. వారి కృషిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ లయన్ చంద్రమోహన్ రెడ్డి, క్లబ్ కార్యదర్శి లయన్ మంత్రి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి లయన్ పూదరి విజయ్ కుమార్, ఏరియా లీడర్ లయన్ కాలగిరి గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

