కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో డా.ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అబ్దుల్ కలాం దేశ రక్షణ, విజ్ఞాన శాస్త్రం, విద్యా రంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువత కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

