కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నల్లకుంట(Nallakunta) పరిధిలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వెంకటేష్‌ను పోలీసులు(Police) శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. త్రివేణి, వెంకటేష్ పదేళ్ల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో వెంకటేష్ సెంట్రింగ్ పని చేస్తూ, త్రివేణి హౌస్ కీపింగ్ పని చేస్తూ పిల్లలతో కలిసి బతుకుతున్నారన్నారు. కొన్నేళ్ల నుంచి వెంకటేష్ త్రివేణిని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగినట్లు చెప్పారు. ఈ నెల 23న రాత్రి త్రివేణి ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో వెంకటేష్ మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం కొడుకు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Read Also: మహిళలకు బిగ్ రిలీఫ్.. ఓలా, ఉబర్‌లో కొత్త రూల్
Follow Us On: Youtube


