రంగనాథ్‌ను తొలగించండి.. హైకోర్ట్ సంచలన ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: హైడ్రా (HYDRAA)  కమిషనర్ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలంటూ హైకోర్ట్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో మరో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. లోతుకుంట భూముల వ్యవహారంలో హైకోర్ట్ ఆదేశాలను ధిక్కరించి మరీ.. ప్రవేశించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సారీ చెప్పిన రంగనాథ్..

లోతుకుంట భూముల్లోకి ప్రవేశించడంపై హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు చెప్పినా.. కోర్ట్ పరిగణనలోకి తీసుకోలేదు. పిటిషనరే అవాస్తవాలు చెప్పారని రంగనాథ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, ఆయనపై 63 కోర్ట్ ధిక్కరణ కేసులున్నాయని చెప్పిన కోర్ట్.. ఒక సెక్రటరీ ర్యాంక్ ఉన్న వ్యక్తిపై ఈ స్థాయిలో కేసులుండటం ఏమాత్రం సరికాదన్నారు. వెంటనే రంగనాథ్‌ను కమిషనర్ పదవి నుంచి తప్పించాలని ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>