హైద‌రాబాద్‌లో విదేశీ యువ‌తికి లైంగిక వేధింపులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌ (Hyderabad) లో ఓ విదేశీ యువ‌తికి లైంగిక వేధింపులు ఎదుర‌య్యాయి. త‌న ప్రియుడి స్నేహితుడే త‌న‌ను వేధిస్తున్నాడ‌ని బాధితురాలు గ‌చ్చిబౌలి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నెద‌ర్లాండ్స్‌కు చెందిన ఓ యువ‌తి మార్చి 5న త‌న ప్రియుడ‌డిని క‌లిసేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఆమె ప్రియుడు గ‌చ్చిబౌలిలోని ఓ ఫ్లాట్‌లో త‌న స్నేహితుడితో క‌లిసి ఉంటున్నాడు. హైద‌రాబాద్‌లో ఉన్న‌న్ని రోజులు ఆమె కూడా అక్క‌డే ఉంది. ఈ స‌మ‌యంలో ఆమె ప్రియుడి స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించాడని యువ‌తి ఆరోపిస్తోంది.

మార్చి 17న తాను ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడికి యత్నించాడని గ‌చ్చిబౌలి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ప్రియుడు త‌న స్నేహితుడిని మందలించినా వేధింపులు ఆగలేదని ఫిర్యాదులో పేర్కొంది. నెద‌ర్లాండ్స్‌కు వెళ్లిన తర్వాత కూడా ఫోన్ కాల్స్‌తో వేధించాడ‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం నెద‌ర్లాండ్స్‌లో ఉన్న స‌ద‌రు యువ‌తి ఇండియ‌న్‌ ఎంబసీని ఆశ్రయించి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వేధింపుల కేసు (Harassment Case) నమోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితుడు ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>