కరీంనగర్‌లో ఉత్సాహంగా ‘అద్విత ఎకో రన్’

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) భగత్‌నగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అద్విత ఎకో రన్ – 2026’ కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ‘ప్రకృతి కోసం – భావి తరాల కోసం’ అనే నినాదంతో పాఠశాల ఎకో క్లబ్ విద్యార్థులే ప్రణాళిక రూపొందించి, నిర్వహించడం విశేషం. పాఠశాల ఛైర్మన్ కొమరయ్య సౌగాని, డైరెక్టర్ అనుదీప్ సౌగాని పర్యవేక్షించారు.

ఫ్లాష్‌మాబ్, నాటికలు ప్రదర్శిస్తూ..

ఎకో క్లబ్ సభ్యులు పర్యావరణ పరిరక్షణ సందేశాలతో కూడిన క్లాత్ బ్యానర్లను ప్రదర్శిస్తూ, మొక్కలను పంపిణీ చేశారు. ఫ్లాష్‌మాబ్, నాటికలు ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా అటవీ అధికారి సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హుస్సేన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం అతిథులకు ఆరోగ్యకరమైన చిరుధాన్య మాల్ట్ అందించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>