కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం

కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈ రోజు కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతున్నారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో అనేక కీలక అంశాలను వారితో చర్చించబోతున్నారు. సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలు, స్వర్ణాంధ్ర విజన్ విధానాలపై క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అదే సమయంలో జిల్లాల వారీగా వస్తున్న పెట్టుబడులపై కూడా ఆరా తీయబోతున్నారు. మొత్తం 19 అంశాల ఎజెండాను ఇప్పటికే ఖరారు చేయగా.. వీటిపైనే సమీక్షించబోతున్నారు.

శాంతి భద్రతలపై ప్రత్యేకంగా..

రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు శాంతిభద్రతలపై కూడా పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ఇటీవల వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>