నిర్మల్ జిల్లా గెజిటెడ్ అధ్యాపకుల సంఘం ఏకగ్రీవం!

కలం, నిర్మల్ : తెలంగాణ ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని (Nirmal TGCTA) ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డాక్టర్ కె. రఘునాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కట్ట రమేశ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల అధికారిగా డాక్టర్ జె. భీమరావు వ్యవహరించారు. నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యూ. గంగాధర్ తో పాటు నిర్మల్, భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సూర్యసాగర్, రవికుమార్, సుభాష్, అర్చన, శంకర్, శ్రీహరి, శ్రీనివాస్, దిలీప్ లు నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: స‌రిహ‌ద్దు గ్రామాలే దేశ మొద‌టి గ్రామాలు: మోదీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>