‘మన్ కీ బాత్’ వీక్షించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

కలం, నిర్మల్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) 136వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని భైంసా పట్టణంలో ఆదివారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. సైనికుల దేశభక్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అలాగే ఎల్‌నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు బీజేపీ సీనియర్ నాయకులు రావుల పోశెట్టి, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పండిత్ రావ్ పటేల్, నాయకులు యోగేశ్, సట్ల సాయి, కిష్టయ్య, భోజరాం పటేల్ ప్రధాని సందేశాన్ని ఆసక్తిగా వీక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>