విద్యార్థుల నిరసనలపై ధర్మేంద్ర ప్రదాన్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : రాజీనామా అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. నీట్ లీకేజీపై విద్యార్థుల చేస్తున్న నిరసనలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను కొందరు వ్యక్తులు తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. 4 దశాబ్దాలకు పైగా విద్యా వ్యవస్థకు అంకితమైన తాను, యువత కలలు నెరవేర్చడం అందరి బాధ్యత అని తెలిపారు.

నీట్‌లో అవకతవకలు బయటపడగానే తక్షణం స్పందించామని, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే, నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించామని, మొదటి నుంచి బాధ్యతగా వ్యవహరించామని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును సురక్షితం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

Read Also: ఆందోళనలు విరమించి ఇంటికి వెళ్తున్నాం : సీజేపీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>