ఆందోళనలు విరమించి ఇంటికి వెళ్తున్నాం : సీజేపీ

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయడంపై క్రాకోజ్ జనతా పార్టీ (CJP ) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలు జరపడానికి ముందు ఈ పరిణామం జరగడం హర్షణీయం అని సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో తమ ప్రధాన డిమాండ్లు నెరవేరడంతో ఇకపై ఆందోళనలు విరమించి వెనక్కి (ఇళ్లకు) వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కాగా, నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగిన విద్యార్థుల నిరసనలు, పరిణామాల నేపథ్​యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరక తన రాజీనామా లేఖను నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో విద్యార్థి సంఘాల (సీజేపీ) ప్రతినిధుల చర్చలు జరగడానికి ముందు ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also : పతకానికి చేరువలో ఆగిన అశోక్ మాలిక్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>