సిద్దిపేటలో ఖైదీ పరార్

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చిన రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుపోయాడు. బైక్ దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్న సాయికుమార్ అనే వ్యక్తిని పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సాయికుమార్‌తో పాటు మరొక ఆరుగురు మొత్తం ఏడుగురు ఖైదీలను పోలీసులు సిద్దిపేట జనరల్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో సిబ్బంది ఉండగానే, పోలీసుల పహారా నుంచి సాయికుమార్ (Prisoner Escapes) పరారయ్యాడు. ఖైదీ పరారైన విషయాన్ని గమనించిన పోలీసులు.. వెంటనే పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతూ, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి వంటి రద్దీ ప్రాంతం నుంచి ఖైదీ తప్పించుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది.

Read Also: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>