గూడూరులో ట్రాజెడీ.. బైక్‌ను ఢీకొన్న లారీ

కలం, మహబూబాబాద్: గూడూరు(Gudur) మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గూడూరు మండలానికి చెందిన విష్ణు బైక్‌పై వెళ్తుండగా, అదే మార్గంలో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>