కలం, నారాయణపేట: నారాయణపేట (Narayanpet) జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మృతి వనం నిర్మాణానికి అక్కడి యువత… ఆయా సంఘాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను కనులకు కట్టేలా నిర్మాణ పనులు ప్రారంభించారు.
కాగా, గురువారం చత్రపతి శివాజీ మహారాజ్ స్మృతి వనం నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట కౌన్సిలర్ యు. మహేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, పళ్ళ రఘు, గోపి కృష్ణ, నవీన్ తదితరులు ఉన్నారు.

