అలర్ట్.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం వేగంగా మారిపోయింది. ఈ ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన (Rain Alert) జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా, నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.0 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. ఆవర్తన ప్రభావం బలంగా ఉండటంతో రానున్న కొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: లాఠీలతో కొడుతారా?.. రాహుల్ గాంధీ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>