‘అసలుకి ఐదు రెట్ల డబ్బు’.. ఘరానా మోసం..!

కలం, వెబ్ డెస్క్ : ‘తమ దగ్గర బ్లాక్ మనీ ఉందని.. అసలుకి ఐదు రెట్ల డబ్బులు ఇస్తాం’ అంటూ అమాయక ప్రజలకు ఊహించని ఆఫర్ ఇచ్చి బురిడీ కొట్టిస్తున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘరానా మోసం తిరుపతి (Tirupati) లో నగరంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన అజ్మీరా రాజారాం అనే వ్యక్తిని టార్గెట్ చేసిన ముఠా, తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి భారీ డిస్కౌంట్ ఇస్తున్నామంటూ నమ్మించారు. అసలు మొత్తానికి ఐదు రెట్లు ఎక్కువ కరెన్సీ ఇస్తామని ఆశ చూపారు. దీంతో వారి మాటలు నమ్మిన రాజారాం డీల్ కుదుర్చుకున్నారు. కానీ ఆ తర్వాత వారించిన నోట్లను గమనించిన రాజారాం షాక్‌కు గురయ్యారు. అవి ఒరిజినల్ నోట్లు కావు, నకిలీ నోట్లు అని గుర్తించారు.

వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజారాం ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నకిలీ నోట్ల ముఠా గుట్టును రట్టు చేస్తూ ఐదుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుల నుంచి 5 వేల ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఇలాంటి కేటుగాళ్ల వలలో పడి మోసపోవద్దని, ఎవరైనా ఇలాంటి ఆఫర్లతో వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>