కలం, నిర్మల్: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు (Private Hospitals), డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిపై ప్రభుత్వం నియంత్రణ తీసుకురావాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, రక్తపరీక్షల ల్యాబ్‌లలో ఒకే పరీక్షకు ఒక్కో చోట ఒక్కో రకంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రోగులపై ఆర్థిక భారం తగ్గించేందుకు అన్ని ఆస్పత్రులు, ల్యాబ్‌లలో పరీక్షలు, చికిత్సల ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని, ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు మురళీధర్, మల్లేశ్వర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: కంటి పరీక్ష సేవలను సద్వినియోగం చేసుకోవాలి : కూచాడి శ్రీహరి రావు
Follow Us On: Instagram

