కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 46 మందిపై డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీరిని కోర్టులో ప్రవేశ పెట్టగా.. స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి బి.నాగలక్ష్మి శనివారం ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.4,60,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రాసిక్యూషన్‌కు చురుగ్గా సహకరించి, నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

