కలం, కరీంనగర్: కళావతి ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ (Lions Club) ఆధ్వర్యంలో శనివారం రామగుండంలో పలువురు దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు కళావతి, సెక్రటరీ జయప్రద, లైన్స్ క్లబ్ ప్రతినిధులు మల్లికార్జున్, రాజేందర్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వివిధ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను అందించారు. కళావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఎంపీ అభినందించారు.

