గురుకుల విద్యార్థులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman kumar) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల (TGSWREIS)లో చదివి నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం సాధించిన సాయి ప్రవల్లిక కలిసి సీఎం రేవంత్ రెడ్డిని, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ల‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విజయం వెనుక ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, సీఎం దూరదృష్టి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం కలిసి ఉన్నాయ‌న్నారు. ఈ విజయాలు ఒక్క విద్యార్థుల కుటుంబాలతో పాటు, తెలంగాణ సమాజానికే గర్వకారణ‌మ‌న్నారు.

ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ…తమ పిల్లలకు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఉచిత ప్రత్యేక కోచింగ్‌, అన్ని సౌకర్యాలు కల్పించి వారి కలలను సాకారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో SCDD ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి, TGSWREIS కార్యదర్శి కంభంపాటి శారద, జాయింట్ సెక్రెటరీ (అకాడమిక్) సక్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>