ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల సమస్య.. హౌసింగ్ ఎండీకి ఎమ్మెల్యే వినతి

కలం, నాగర్ కర్నూల్ : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల సమస్యను పరిష్కరించాలని హౌసింగ్ ఎండీని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (MLA Kuchukulla Rajesh Reddy) కోరారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ను ఎమ్మెల్యే కలిశారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఎల్-3 హౌసింగ్ బిల్లుల విడుదలలో నెలకొన్న సమస్యలను హౌసింగ్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు.

లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరితగతిన విడుదల చేసి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. వినతిని స్వీకరించిన హౌసింగ్ ఎండీ సానుకూలంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>