కలం, వెబ్ డెస్క్ : ఎల్ నినో (El Nino) ప్రభావం, దాని వల్ల ఏర్పడే వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా చిన్నారెడ్డిని నియమించగా, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను కన్వీనర్‌గా నియమించింది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయం, వర్షపాతం, కరువు పరిస్థితులపై కమిటీ లోతుగా పరిశీలన చేయనుంది.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, రైతులకు అవసరమైన సహాయ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కమిటీ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేయనుంది.
వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేసి, వ్యవసాయ రంగానికి నష్టం తగ్గించే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించడం కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.

