SC బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో క్రిస్టియన్‌ పల్లిలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహ ప్రాంగణం, వంటశాలను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను సమీక్షించారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వసతి, భోజనం, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు నాణ్యంగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>