గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని (Nagarjuna Sagar) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఐలయ్య తెలిపారు. ఈ నెల 23వ తేదీలోగా కాలేజీలో దరఖాస్తు ఫారం ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.

ఖాళీల వివరాలు ఇలా..

సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో నాలుగు పోస్టులున్నాయి. కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగంలో రెండు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్ట్ ఖాళీగా ఉంది.

అభ్యర్థుల అర్హతలు..

ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టులకు సంబంధించి కచ్చితంగా బీఈ, బీ.టెక్, ఎంటెక్ చదివి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ చేసి ఉండాలి. NET, SLET, Ph.D చేసినవారితో పాటు ఇతర బోధన అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. గెస్ట్ లెక్చరర్ గా ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాల చెల్లింపు ఉంటుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>